SDPT: జిల్లా బెజ్జంకి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో,శాంతిభద్రతల పరిరక్షణకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుచి డిసెంబర్ 15, 2025 ఉదయం 7 గంటల వరకు సెక్షన్ 163, BNSS, 2023 అమలులో ఉంటుందని బెజ్జంకి ఎస్సై సౌజన్య తెలిపారు. ఈ కాలంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ఊరేగింపులు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.