ASR: కొయ్యూరు మండలం దద్దుగుల గ్రామానికి చెందిన లావణ్య అనే గర్భిణికి శుక్రవారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు, రాజేంద్రపాలెం పీహెచ్సీ 108 అంబులెన్సు వాహనం ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ వర ప్రసాద్ అక్కడకు చేరుకున్నారు. అయితే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వారు గర్భిణికి ప్రసవం చేశారు. అనంతరం తల్లిబిడ్డలను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు.