చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కండోమ్స్‌పై ‘వ్యాట్’ వసూలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ధరలు పెరిగితే సామాన్యులు కొనలేరని, దీనివల్ల లైంగిక సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.