NLR: ఉదయగిరి పట్టణంలోని పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న శ్రీబాలాజీ ఫుట్ వేర్ దుకాణంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.