పుణేలోని ఓ గిరిజన హాస్టల్లో విద్యార్థినులకు ఘోర అవమానం జరుగుతోంది. ఇంటికెళ్లి తిరిగొస్తే కచ్చితంగా ‘ప్రెగ్నెన్సీ టెస్ట్’ చేయించుకోవాల్సిందేనని, లేదంటే హాస్టల్లోకి రానివ్వమని నిర్వాహకులు వేధిస్తున్నారు. ‘ఏ తప్పు చేయకపోయినా మాకీ శిక్ష ఏంటి? దీనివల్ల మా చదువు పాడవుతోంది’ అని బాలికలు కన్నీరుపెడుతున్నారు. తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని అధికారులు బుకాయిస్తున్నారు.