KRNL: హలహర్వి మండలం గుళ్యం గ్రామంలో గాదె లింగేశ్వర స్వామి రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్న ఆమె గ్రామ అభ్యున్నతికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పండుగ సందడితో గ్రామం కళకళలాడింది.