అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ పోరు ముదిరితే మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘గత నెల రోజుల్లో యుద్ధంలో సుమారు 25 వేల మంది మృతిచెందారు. దీన్ని మేము అడ్డుకోవాలనుకుంటున్నాం. ఇందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రమాదం. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయి’ అని ట్రంప్ హెచ్చరించారు.