VSP: ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్‌లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్‌కు జాప్యం కొనసాగుతోంది. విశాఖ రేంజ్లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్‌కు కష్టమౌతోంది.