SRPT: నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు 5 సార్లు ఏకగ్రీవమై ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ ఓటర్లు 980 మంది ఉన్నారు. పంచాయతీకి తొలిసారిగా 1981లో జరిగిన ఎన్నికల్లో గోపయ్య సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1990లో నాగేశ్వరరావు, 2001లో రామారావు, 2006లో వెంకటరమణ, ప్రస్తుత ఎన్నికల్లో రుక్మిణిని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.