అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ వై కోట క్రాస్ వద్ద కడప – తిరుపతి రహదారిపై ఉన్న వాటర్ ప్లాంట్‌లోకి అర్ధరాత్రి తరువాత ఒక లారీ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాటర్ ప్లాంట్‌కు భారీ ఆస్తినష్టం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనతో ప్రాంతంలో కలకలం చెలరేగింది.