NRPT: నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన బర్ల లక్ష్మికి ప్రభుత్వం నుంచి రూ. 4,00,000 విలువగల LOC మంజూరైంది. ఈ మంజూరు పత్రాన్ని గురువారం మంత్రి వాకిటి శ్రీహరి ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రవేశపెట్టిన పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీహరి ఈ సందర్భంగా తెలిపారు.