WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్ సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేక వేతనాలు జాప్యం కావడం, తదితర సమస్యలపై శుక్రవారం ప్రాంతీయ ఆసుపత్రి సమన్వయ అధికారి డా. రామ్ మూర్తి, ఎంఎస్ డా. నర్సింహస్వామికి వినతి పత్రం అందజేశారు. వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, సెకండరీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరారు.