PPM: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి శుక్రవారం కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు వెళ్తుండగా పాలకొండలో సీఐటీయూ నేత రమణారావు గృహ నిర్బంధించారు. శుక్రవారం ఉదయం రమణారావు ఇంటికి పోలీసులు వెళ్లి ఆయనను బయటకు రాకుండా కాపాలకాశారు. రమణారావు మాట్లాడుతూ. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.