AP: రాష్ట్ర ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. ఏజెన్సీతోపాటు మైదాన ప్రాంతాల్లో సైతం ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా జి.మాడుగులలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. డుంబ్రిగుడలో 3.6, అరకులోయలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, చింతపల్లిలో 6.5, పాడేరులో 6.7, పెదబయలులో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.