AKP: అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పరిధిలో గల రాంబిల్లి మండలంలో సోలార్ పలకల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. రూ.3,990 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2028 జనవరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.