SKLM: శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించినట్లు ఈవో ఏడుకొండలు తెలిపారు. 74 రోజులకు సంబంధించి లెక్కింపు చేపట్టగా రూ.8,10,214 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వాటిని స్వామి పేరున ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్చకులు, దేవాదాయశాఖ సిబ్బంది, సత్యసాయి భజన మండలి భక్తులు పాల్గొన్నారు.