MDK: హవేళిఘనపూర్ మండలం జక్కన్నపేట సర్పంచిగా చామంతుల సత్యనారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన చామంతుల సత్యనారాయణ సమీప ప్రత్యర్థిపై 109 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1995లో సర్పంచ్‌గా గెలుపొందిన సత్య నారాయణ 30 ఏళ్ల తర్వాత మరోసారి సర్పంచ్‌గా గెలుపొందారు. గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి తన లక్ష్యమన్నారు.