AKP: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని అతి పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి. ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు, ఖండవల్లి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో ఇవాళ విశ్వక్సేన పూజ, పంచశమోద్ధారణ, శాంతిహోమాలు, పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ, శాంతి కళ్యాణం, మహాదాశీర్వచనం, నీరాజన, మంత్రపుష్పాలు ఘనంగా నిర్వహించారు.