KMR: నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 13న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. ఈ పరీక్షకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 5,124 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష సమయం ఉ.11:30 గంటల నుంచి 1:30 ని,ల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు.