NLG: చిట్యాల మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి షాక్ తగిలందనే చెప్పవచ్చు. ఆరెగూడెంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి నాగంపల్లి శ్యామ్ సుందర్ విజయం సాధించారు. గ్రామంలోని 8 వార్డులకు గాను ఏడు వార్డుల్లో శ్యాం సుందర్ బలపరిచిన వార్డు సభ్యులు విజయం దక్కించుకున్నారు. మంత్రి కోమటిరెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.