ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ముప్పవరపు సుచిత్రను నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమె భర్త ముప్పవరపు వీరయ్య టీడీపీలో కీలక పదవులను చేపట్టి, ఇటీవల హత్యకు గురయ్యారు. ముప్పవరపు వీరయ్య కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ముప్పవరపు సుచిత్రకు అవకాశం దక్కింది.