VSP: సింహాచలంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 19వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నాయి. దీంతో డిసెంబర్ 16న మధ్యాహ్నం దర్శనాలు నిలిపివేస్తారని, డిసెంబర్ 20-29 మధ్య ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో సుజాత తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకే దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 14న గోదా కళ్యాణం జరుగుతుందని చెప్పారు.