అన్నమయ్య: లీగల్ మెట్రాలజీ అధికారులు బుధవారం సాయంత్రం పాయకరావుపేటలో పలు రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అనధికార తూనిక యంత్రాలతో నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లింగాల తోట కాలనీ, మంగళవారం రోడ్డులో గల రేషన్ షాపుల డీలర్లు రేషన్ పంపిణీలు అవకతవకలకు పాల్పడుతున్న కారణంగా వారిపై కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ అనురాధ తెలిపారు.