ప్రకాశం: గుంటూరు రేంజ్ ఐజీ బుధవారం రాత్రి సింగరాయకొండ పోలీస్ స్టేషను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో చేపడుతున్న చట్టం-సంరక్షణ చర్యలు, ప్రజా భద్రతకి సంబంధించిన పలు అంశాలపై ఆయన సమీక్షించారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువ కావాలని, సేవా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.