AKP: మునగపాక మండలం గణపర్తిలో ఈనెల 13వ తేదీన నిర్వహించే గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని ఎటువంటి తగాదాలు పడకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ ధనంజయరావు సూచించారు. ఇవాళ ఎస్సై ప్రసాద్ రావుతో కలిసి గ్రామంలో పర్యటించారు. తగాదాలు కారణంగా ఇప్పటికే గౌరీ పరమేశ్వరుల ఉత్సవం వాయిదా పడుతూ వస్తుందన్నారు. గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు.