YS Sharmila: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు హీటెక్కాయి. పొత్తులకు సంబంధించి పూటకో పార్టీ నుంచి లీకు వస్తోంది. వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పొత్తులు పెట్టుకోనని.. ఒంటరిగా బరిలోకి దిగుతానని చెబుతున్నారు. ఈ రోజు మరోసారి అదే అంశం మీద మాట్లాడారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు (CM KCR) 10 ప్రశ్నల సంధించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా..? ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీలో విలీనం చేయాలా..? YSR పేరుతో పార్టీ పెట్టీ రెండేళ్లు అవుతుందని.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం కేసీఆర్ (KCR) మోచేతి నీళ్ళు తాగాయని విమర్శించారు. 3850 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది పొత్తులకు, విలీనం చేయడానికి కాదని షర్మిల (YS Sharmila) అన్నారు. ఏ పార్టీతో చేరతానని అంటే వద్దనే వారు ఎవరని అడిగారు. తాను వెళ్తానంటే కేసీఆర్ (KCR) కూడా వద్దనడు కదా అన్నారు. విలీనం అని చెప్పి తన కష్టాన్ని తక్కువ చేయడం సరి కాదన్నారు. విలీనం అని మహిళను అవమానించకండి.. విలీనం అనే పదం వాడొద్దని షర్మిల (YS Sharmila) సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని షర్మిల (YS Sharmila) అన్నారు. అన్ని నియోజక వర్గాల్లో సొంతగా అభ్యర్థులను బరిలోకి దింపుతుందని వివరించారు. 2018 లో కాంగ్రెస్ 19 సీట్లు గెలిస్తే 14 మందికి కేసీఆర్ (KCR) కొన్నాడని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్‌కి ఓటు వేసినట్టేనని చెప్పారు. అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కేసీఆర్‌కు మద్దతు ఇస్తోందని చెప్పారు. మళ్లీ సప్లైయింగ్ కంపెనీగా మారుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి 30 సీట్లు కన్నా ఎక్కువ రావు.. కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోతుందని చెప్పారు.
కేసీఆర్‌కు (KCR) వ్యతిరేకం అని అన్ని పార్టీలు క్లారిటీ ఇవ్వాలి.. అప్పుడే పొత్తులపై ఆలోచన చేస్తాం అని షర్మిల (YS Sharmila) అన్నారు. విపక్షాలతో కలుస్తామెమో కానీ.. కేసీఆర్‌తో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. గత 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ (KCR) మోసం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. 4.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరి నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టాడని.. తెచ్చిన అప్పులు అన్ని ఎక్కడ పోయాయని షర్మిల అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షన్నర కోట్లు కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు.