జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి బడ్జెట్లో రెండు సంవత్సరాల్లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, మేడిగడ్డను పునరుద్ధరించాలని కూడా అన్నారు. తుమ్మడిహెట్టి కాంగ్రెస్ పార్టీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.