AP: వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. దర్యాప్తు నివేదికతో పాటు గతంలో సిట్ రిపోర్టులను, 13 లక్షల ఫైళ్లను ఇండెక్స్ రూపంలో నిందితులకు అందజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్‌లను విచారించినట్లు తెలిపింది. ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన నిందితులు కోర్టుకు హాజరుకాగా, తదుపరి విచారణను ఈనెల 16కి కోర్టు వాయిదా వేసింది.