AP: అవినీతి ఆరోపణల కారణంగా గతంలో కడప మేయర్ సురేష్ బాబును కూటమి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. డిప్యూటీ మేయర్‌కు తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే కొత్త మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనను మేయర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.