SKLM: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా అదనపు ఎస్పీ KV రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు.