»Indian Army And Jk Police Recovered 10 Kg Ied From Terrorists
Terrorists నుంచి 10 కిలోల ఐఈడీ స్వాధీనం
పూంచ్ సెక్టార్ వద్ద నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత సైన్యం అడ్డుకోగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఓ భారత సైనికుడు గాయపడగా.. తర్వాత టెర్రరిస్ట్స్ లొంగిపోయారు. వారి నుంచి 10 కిలోల ఐఈడీ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Indian Army And JK Police Recovered 10 KG IED From Terrorists
10 KG IED Recover: జమ్ముకశ్మీర్‌లోకి (jammu kashmir) చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పూంచ్ సెక్టార్ వద్ద గల నియంత్రణ రేఖ నుంచి దాటేందుకు ఉగ్రవాదులు (Terrorists) ప్రయత్నించారు. వారిని భారత సైన్యం (army), జమ్ము కశ్మీర్ (jammu kashmir) పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద ఆయుధాలు, 10 కిలోల ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు.
భారత భూభాగంలోకి వస్తోన్న ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు (police) అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఓ భారతీయ సైనికుడు గాయపడ్డారు. తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) భారత సైన్యానికి లొంగిపోయారు. వారిని తనిఖీ చేయగా భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. భారత్‌లో మరోసారి పేలుడు జరిపేందుకు కుట్ర చేశారని దీంతో స్పష్టమైంది. కశ్మీర్ నియంత్రణ రేఖ గుండా ఉగ్రవాదుల చొరబాటు జరుగుతూనే ఉంటుంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ చొరబాటు కాస్త తక్కువ అయ్యింది.