పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan),సుప్రీం హీరో సాయిధరమ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా బ్రో తాజాగా చిత్ర బృందం నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం బ్రో… ది అవతార్. కేతిక శర్మ(Ketika Sharma), ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఈ ఎంటర్టయినర్ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా ఇప్పుడు డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాదు(Hyderabad)లో డబ్బింగ్ కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. బ్రో చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి డైలాగులు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండడం విశేషం. ఈ సినిమాకు తమన్ (Taman) సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా యూనిట్ రివీల్ చేసింది.
అయితే ఫ్యాన్స్ మాత్రం తమకు కావాల్సినవి ఇలాంటి అప్డేట్స్ కాదని, టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని చెప్పాంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే హీరోయిన్లను కూడా అఫీషియల్(Official)గా మెన్షన్ చేయకపోవడం పట్ల కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఇక ఇప్పటి నుంచి డబ్బింగ్ తో పాటు మిగితా నిర్మాణ పనులు కూడా చకాచకా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. రిలీజ్ కు మరో 45 రెండు నెలల సమయం ఉండటంతో వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ (Post production) పనులు పూర్తి చేసి ప్రమోషన్ లో దిగనున్నారని అంటున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్(Vinodya Seetham)’కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖనినే డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. చిత్రానికి ఎస్.ఎస్. థమన్ (Thaman)సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.