BDK: పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం క్లబ్లో గురువారం నిర్వహించిన సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తో కలిసి మాట్లాడారు.