తెలంగాణ(Telangana)లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్(Yellow alert) ను జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. నల్గొండ (Nalgonda), సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు పడుతాయని చెప్పింది. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Department of Meteorology) సూచించింది.