ములుగు: ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని సౌకర్యాలు, సీసీ కెమెరాలు, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.