SRCL: రుద్రంగి మండలంలో బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో చేతికందే సమయంలో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.