»Heavy Rains For Another 5 Days Orange Alert For Telangana
Rain Alert: మరో 5 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) అధికారులు వెల్లడించారు.
తెలంగాణ(Telangana)లో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Weather Department) వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలు జోరుగా ఉన్నాయని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(Heavy Rains) పడతాయని, గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీస్తాయని తెలిపింది. అంతేకాకుండా పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Weather Department) ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)ను జారీ చేసింది.
పలు జిల్లాల్లో మంగళవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే సూచనలున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలుల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) అధికారులు వెల్లడించారు.