W.G: మహిళలపై హింస, వివక్షను మౌనంగా భరించకుండా సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం పాలకోడేరు MPDO ఆఫీసులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పుట్టుక తోటే వివక్షకు గురవుతున్నారని, మహిళలు కూడా పురుషులతో సమానమేనన్నారు.