ప్రకాశం: కనిగిరి PACS ఛైర్మన్ అద్దంకి రంగబాబు ఫోన్ మంగళవారం హ్యాక్‌కు గురైంది. రంగబాబు మొబైల్ ఫోన్ నుంచి కనిగిరిలోని కొంతమంది వ్యక్తులకు అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది, పంపమని మెసేజ్‌లు వెళ్లాయి. మెసేజ్‌లు అందుకున్న వ్యక్తులు రంగబాబుకు ఫోన్ చేయగా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఫోన్ హ్యాక్‌కు గురైనట్లు గుర్తించి, రంగబాబుకి తెలిపేందుకు ప్రయత్నం చేశారు.