Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్‌లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి: చంద్రుడు 5వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. స్వల్ప నష్టాలు ఎదురవుతాయి. వృత్తిపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. మానసికంగా టెన్షన్‌కు గురవుతారు.
వృషభ రాశి: చంద్రుడు 4వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు కలుగవచ్చు. వృత్తి పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వివాదాలు, శత్రుత్వాలు కలుగనుంది.
మిథున రాశి: చంద్రుడు 3వ ఇంట ఉంటున్నందున శుభం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో సానుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి: చంద్రుడు 2వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు కలుగవచ్చు. కొన్ని నష్టాలు, కుటుంబ పరమైన ఇబ్బందుల వల్ల మానసికంగా వేదనకు గురయ్యే ఛాన్స్ ఉంది.
సింహ రాశి: చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున శుభం జరుగుతుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి: చంద్రుడు 12వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు కలుగవచ్చు. కొన్ని వృత్తి, వ్యాపార పరంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. అనుకొని ఖర్చులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
తులా రాశి: చంద్రుడు 11వ ఇంట ఉంటున్నందున సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయక పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృశ్చిక రాశి: చంద్రుడు 10వ ఇంట ఉంటున్నందున ఈ రాశి వారికి శుభప్రదం. ఆర్థిక విషయాలతోపాటు వృత్తి, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో మంచి జరుగుతుంది.
ధనూ రాశి: చంద్రుడు 9వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చు. కొన్ని స్వల్ప నష్టాలు, కుటుంబ పర సమస్యల వల్ల మనసు వేదనతో ఉంటుంది.
మకర రాశి: చంద్రుడు 8వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక నష్టాలు ఉండొచ్చు. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఫలితంగా స్వల్ప ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
కుంభ రాశి: చంద్రుడు 7వ ఇంట ఉండటం సానుకూల పరిణామాలను కలుగజేస్తుంది. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు.
మీన రాశి: చంద్రుడు 6వ ఇంట ఉంటున్నందున శుభాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలతోపాటు గృహ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి.