KMM: సిగ్నల్ వ్యవస్థ రద్దీని తగ్గించి, ప్రమాదాలు తగ్గేందుకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. సత్తుపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నూతన సిగ్నల్స్‌ను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. అత్యంత రద్దీగా ఉండే బోసుబొమ్మ సెంటర్, పాత బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.