NLG: ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బీ. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.