VSP: విశాఖ ఆటోనగర్‌లోని ఓ కార్ల గోదాము పైకప్పు మరమ్మతులు చేస్తుండగా, విజయనగరానికి చెందిన జంకల చంటి (32) అనే దినసరి కూలీ సిమెంట్ రేకు విరిగిపోవడంతో పైనుంచి కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.