AP: ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ద్వారకతిరుమల మండలంలోని IS జగన్నాథపురం బయల్దేరారు. అక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు.