కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి.. సమాఖ్య వ్యవస్థకు (Federal System) తూట్లు పొడవడం.. రాష్ట్రాలపై వివక్ష (Discrimination) కొనసాగించడం వంటి కారణాలతో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశాన్ని తొమ్మిది రాష్ట్రాలు (States) బహిష్కరించాయి. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దేశంలోని 9 మంది ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో (Delhi) జరిగిన సమావేశానికి విలువ లేకుండాపోయింది.
నీతి ఆయోగ్ పాలకమండలి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (Unitary Territory) సభ్యులుగా ఉంటాయి. పాలకమండలి సమావేశానికి ఆయా రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ల గవర్నర్లకు ఆహ్వానం ఉంది. కానీ ఈ సమావేశానికి తెలంగాణతో (Telangana) సహా పంజాబ్ (Punjab), ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ లు హాజరుకాలేదు. కాగా ఈ సమావేశాన్ని బహిష్కరించిన రాష్ట్రాలన్నీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్థూ ఈ భేటీకి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు (Chief Ministers) గైర్హాజరయ్యారు.
ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ సమావేశానికి రాలేమని తెలంగాణ, బిహార్ ముఖ్యమంత్రులు కేసీఆర్ (KCR), నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రకటించారు. తాను హాజరు కాలేనని, తన తరఫున రాష్ట్ర మంత్రిని పంపుతామని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ (Mamata Benarjee) తెలిపారు. కానీ ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించలేదు. మమతా పాల్గొనలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ (Ordinance)ను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా సమావేశాన్ని బహిష్కరించారు.
విదేశీ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin), అనారోగ్యం పేరిట రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gahelot), మంత్రివర్గ విస్తరణ కారణంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోపాటు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. సహకార సమాఖ్య వ్యవస్థను ఒక పరిహాసంగా మారుస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.