»Telangana 2008 Dsc Candidates Movement Starts At Indira Park
2008 DSC Candidates సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి.. మాకు ఉద్యోగాలు ఇవ్వాలి
ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని నాడు ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ కు చెబితే న్యాయం చేస్తామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా మాకు న్యాయం జరగడం లేదు.
తాము డీఎస్సీలో (DSC) అర్హత సాధించి 15 ఏళ్లకు తమకు ఉద్యోగాలు (Jobs) కల్పించడం లేదని 2008 డీఎస్సీ బాధితులు ఆందోళన (Movement) బాట పట్టారు. తమ ఉద్యోగాల కోసం దశాబ్దంన్నర నుంచి పోరాటం చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ప్రస్తుతం తెలంగాణలోనూ (Telangana) న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ (Hyderabad)లో ధర్నాకు దిగారు.
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు డీఎస్సీ అభ్యర్థులు (DSC Candidates) మాట్లాడుతూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం (Injustice) జరిగిందని నాడు ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ (KCR)కు చెబితే న్యాయం చేస్తామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా మాకు న్యాయం జరగడం లేదు. న్యాయస్థానం కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. న్యాయపరమైన చిక్కులు లేని తమకు ఉద్యోగం ఇవ్వాలి. సీఎం కేసీఆర్ గతంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నాం’ అని తెలిపారు.