కేశవరెడ్డి.. తెలుగు నవలా రచయిత. వృత్తి రీత్యా ఆయన వైద్యుడైనప్పటికీ.. ఆయన రాసిన నవలలు తెలుగు నవలా సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. ఆయన రాసిన అతడు అడివిని జయించాడు, చివరి గుడిసె, మునెమ్మ, మోహన ఓ మోహన, సిటీ బ్యూటిఫుల్ వంటి నవలలు పాఠకులపై చెరగని ముద్ర వేశాయి. ‘అతడు అడవిని జయించాడు; నవలకు ఉత్తమ నవలా పురస్కారం లభించింది. అంతేకాకుండా ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించారు.