GDWL: పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవిమ్మ కుటుంబ సభ్యులకు CMRF నుంచి మంజూరైన రూ.1.50 లక్షల విలువైన LOC లెటర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.