అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) లాయర్‌కు ఎంత టైం ఇచ్చారో తమ లాయర్‌కు అంత సమయం ఇవ్వాలని సునీత లాయర్లు జడ్జిని కోరారు. జడ్జిఎవరి లిమిట్స్‌లో వారు ఉండాలని హెచ్చారించారు
మాజీ మంత్రి వివేకా హత్య కేసు(Viveka murder case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదాలు కొనసాగుతున్నాయి. వైఎస్ సునీత (YS Sunitha)పై తెలంగాణ హైకోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు లిమిట్స్ ఉండాలని హెచ్చరించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు(High Court) లో విచారణ కొనసాగుతోంది. అవినాశ్ రెడ్డి (Avinash Reddy) తరపు లాయర్లు, వైఎస్ సునీత న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు సాగుతున్నాయి. అయితే అందరి వాదనల ఈ రోజే వింటామని జడ్జి సూచించారు.
అవినాశ్ రెడ్డి లాయర్‌కు ఎంత సమయం ఇచ్చారో తమకు అంతే సమయం ఇవ్వాలని వైఎస్ సునీత కోరారు. దీంతో జడ్జి సీరియస్ అయ్యారు. వైఎస్ సునీత మధ్యలో కలుగజేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు ఈ ఉదయం పదిన్నరకు మొదలైన వాదనలు లంచ్ విరామం తర్వాత కూడా జరుగుతున్నాయి. సిట్ పోలీసులకు వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ (Statement) చాలా కీలకమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వాచ్ మెన్ రంగన్న స్టేట్ మెంట్లో ఏం చెప్పాడో వాటిని ప్రొడ్యూస్ చేయాలని కోర్టు తెలిపింది. అటు అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ కీలక సాక్షి రంగన్న స్టేట్ మెంట్ పట్టించుకోకుండా సీబీఐ (CBI) వదిలేసిందని తెలిపారు.