TG: మూసీనదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని CM రేవంత్ రెడ్డి అన్నారు. సబర్మతి నది, గంగా నదిని ప్రక్షాళన చేసుకోలేరా? మన హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. హైడ్రాకు ఏం కావాలన్నా ఇస్తానన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు తనకు అండగా నిలబడ్డారన్నారు.